శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా ఒక వెబ్ సిరీస్ ని చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'జాన్‌బాజ్ హిందుస్తాన్ కే' అనే టైటిల్ న ఐ మూవీ మేకర్స్ లాక్ చేసారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో రెజీనా కసాండ్రా ఒక పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారిణిగా నటిస్తోంది.
తాజగా ఇప్పుడు, ఈ సిరీస్ ప్రీమియర్ రైట్స్ ని కలిగి ఉన్న ZEE5 సోషల్ మీడియాలో ట్రైలర్‌ను విడుదల చేసింది. వరుస పేలుళ్లకు ప్లాన్ చేసిన నిందితులను కనిపెట్టే పనిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో రెజీనా ఈ సిరీస్ లో కనిపించింది. అంతేకాకుండా, జనవరి 26, 2023న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని ZEE5 ప్రకటించింది.
ఈ వెబ్ సిరీస్‌లో బరున్ సోబ్తి, మితా వశిష్ట్ మరియు సుమిత్ వ్యాస్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa