ప్రపంచస్థాయిలో సత్తా చాటుతున్న భారతీయ చిత్రం RRR. ఒక్కో రోజు ఒక్కో కొత్త హాలీవుడ్ అవార్డుతో, నామినేషన్ తో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న RRR ఈసారి ఒకేసారి రెండు ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుని తన స్థాయిని మరింత పెంచుకుంది.
న్యూ ఇయర్ తరవాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించి భారతీయ ప్రేక్షకులను సంబరాల్లో ముంచెత్తిన RRR చిత్రం తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం, బెస్ట్ సాంగ్ (నాటు నాటు) విభాగాల్లో అవార్డులను గెలుచుకుని, ఈ సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకం చేసింది. దీంతో చిత్రబృందానికి ప్రపంచం నలుమూలల నుండి శుభాకాంక్షలు అందుతున్నాయి.