RRR మూవీ తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్ 'క్రిటిక్స్ ఛాయిస్' బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం, బెస్ట్ సాంగ్ అవార్డులను అందుకుంది. దీంతో భారతీయ ప్రేక్షకులు ఆనందోత్సహాల్లో మునిగిపోయారు.
ఈ అవార్డుల కార్యక్రమంలో దిగ్గజ దర్శకరత్నం రాజమౌళి, ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ ని కలవడం జరిగింది. పదినిమిషాల పాటు వీరిద్దరూ ముచ్చటించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా RRR సినిమాను తనొకసారి, ఆపై భార్య సూజి తో కలిసి మరొకసారి చూసినట్టు, ఆయనకు సినిమా చాలా బాగా నచ్చినట్టు, రాజమౌళి ట్వీట్ చేసారు. ఆయనతో ముచ్చటిస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ మేరకు ఆయనతో కలిసి సంభాషించిన పది నిమిషాలను జీవితంలో మరిచిపోలేనట్టు రాజమౌళి పేర్కొన్నారు.