యంగ్ హీరో సందీప్ కిషన్, 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ జంటగా నటిస్తున్న సినిమా "మైఖేల్". రంజిత్ జయకొడి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీరోల్ లో నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, మైఖేల్ చిత్రీకరణ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు చిత్రబృందం చిన్న వీడియో గ్లిమ్స్ ను విడుదల చేసి చిత్రీకరణ పూర్తయ్యిందని అధికారిక ప్రకటన చేసింది.
సామ్ CS సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 3న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.