యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం "బెదురులంక 2012". రీసెంట్గానే ఈ మూవీ నుండి చిన్న గ్లిమ్స్ వీడియో విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.
తాజాగా ఈ సినిమా నుండి హీరో హీరోయిన్లు కలిసి ఉన్న న్యూ పోస్టర్ విడుదలైంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్లో హీరో హీరోయిన్లు రొమాంటిక్ స్టిల్ లో కనిపిస్తున్నారు.
డీజే భామ నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు క్లాక్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.