సూపర్ స్టార్ మహేష్ బాబు, డస్కీ సైరన్ పూజాహెగ్డే జంటగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "SSMB 28". హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం రేపటి నుండి ఈ మూవీ న్యూ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ జరగనుందట. అంతకుముందు జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో కూడా మేకర్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించిన విషయం తెలిసిందే.