నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన న్యూ మూవీ "వీరసింహారెడ్డి" తాజాగా USA లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుందని తెలుస్తుంది. ఇప్పటివరకు USA లో వన్ మిలియన్ కు పైగా కలెక్షన్లను అంటే 8కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవర్సీస్ టోటల్ గ్రాస్ 1. 376 మిలియన్ డాలర్లుగా తెలుస్తుంది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.