ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సంక్రాంతి బరిలో వారిసు / వారసుడు మూవీని దింపి, ఘనవిజయం అందుకున్నారు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారిసు అన్స్టాపబుల్ కలెక్షన్లను రాబడుతుంటే, తెలుగులో వారసుడు డీసెంట్ హిట్ అందుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజు మూడు భారీ పాన్ ఇండియా సినిమాలను భారీ బడ్జెట్టుతో హై వాల్యూ VFX టెక్నాలజీ తో నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ లో రాజుగారు మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో నిర్మించబోయే 'రావణం' గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారు. మిగిలిన రెండు ప్రాజెక్టులు హిట్ ఫేమ్ శైలేష్ కొలను 'విశ్వంభర', మోహనకృష్ణ ఇంద్రగంటి 'జటాయు' అని ప్రచారం జరుగుతుంది. ఐతే, ఈ రెండు ప్రాజెక్టులపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసి ఉంది.