మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటించిన "వాల్తేరు వీరయ్య" ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అన్స్టాపబుల్ కలెక్షన్లను రాబడుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో వాల్తేరు వీరయ్య కలెక్షన్లు డే 1< డే 2< డే 3గా ఉన్నట్టు తెలుస్తుంది. కర్ణాటకలో గత మూడ్రోజులుగా ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం.
బాబీ డైరెక్షన్లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.