ట్యాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న చిత్రం "భోళా శంకర్". తమిళ సూపర్ హిట్ 'వేదాళం' కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, ఈ రోజు నుండి భోళా శంకర్ న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు భోళా శంకర్ న్యూ షెడ్యూల్ కోసం ఏర్పాటు చేసిన భారీ కోల్కతా సెట్స్ లో దర్శక నిర్మాతలు దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పోతే, ఇప్పటివరకు ఈ మూవీ 30శాతం షూటింగ్ జరుపుకుందని, అన్నీ అనుకున్నట్టు జరిగితే మే నెలలో విడుదల అవుతుందని, ఒకవేళ మిస్ ఐతే దసరాకి వస్తుందని రీసెంట్గానే మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.