RRR సినిమా ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుని భారతీయ ప్రేక్షకులందరూ గర్వపడేలా చేసింది. ఈ నేపథ్యంలో మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీయార్ ను కలిసిన మన భారత క్రికెట్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, శుభ్ మన్ గిల్ ప్రపంచవ్యాప్తంగా RRR సృష్టిస్తున్న సెన్సేషన్ కు గానూ తారక్ కి శుభాకాంక్షలు తెలియచేసారు.
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తారక్ తో కలిసి దిగిన పిక్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది.. RRR గోల్డెన్ గ్లోబ్ సాధించడం పట్ల మరొకసారి శుభాకాంక్షలు తెలియచేసారు. మరొక క్రికెటర్ యజువేంద్ర చాహల్ కూడా తారక్ తో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆయనొక జెంటిల్ మెన్ అని, RRR గోల్డెన్ గ్లోబ్ సాధించడం పట్ల భారతీయులుగా తాము ఎంతో సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నామని కామెంట్ చేసారు.