బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సుబ్బరాజ్, దివి, రవిరాజ్, కృష్ణ బురుగుల తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ "ATM". చంద్రమోహన్ డైరెక్షన్లో దోపిడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ను హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు.
బస్తీ జీవితం పై విరక్తి కలిగిన నలుగురు యువకులు నవాబ్ జీవితం పొందేందుకు చేసిన దోపిడీ ఎందుకు ఆ కుర్రాళ్ళ ప్రాణాల మీదికి వచ్చింది? ఇందులో పోలీసాఫీసర్ సుబ్బరాజ్ పాత్ర ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే జనవరి 20 అంటే మరో మూడ్రోజుల్లో జీ 5 ఓటిటిలో ప్రసారమయ్యే ATM వెబ్ సిరీస్ ను చూడాల్సిందే.
![]() |
![]() |