వారిసు సినిమాతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు కోలీవుడ్ నిర్మాణరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అమేజింగ్ కలెక్షన్లను రాబడుతూ, ఫస్ట్ ఎటెంప్ట్ లోనే దిల్ రాజు గారికి భారీ లాభాలను ఆర్జించి పెడుతుంది. తాజాగా ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటించారు. థమన్ సంగీతం అందించారు.