ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ ఎస్ ఎస్ రాజమౌళి గారు తన కెరీర్ తొలినాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ తో రూపొందించిన "సింహాద్రి" మూవీ మరోసారి థియేటర్లకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి మూవీ రీ రిలీజ్ కాబోతుంది. త్వరలోనే రీ రిలీజ్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మేకర్స్ నుండి రానుంది.
దర్శకధీరుడు రాజమౌళి సెకండ్ డైరెక్టోరియల్ గా రూపొందిన ఈ యాక్షన్ ఫిలిం లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా, భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు కథను అందించారు.
2003, జులై 9న ధియేటర్లకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.