టాలీవుడ్ ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ కూడా ఉంటారు. గతంలో వీరిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుండేది అలానే పవన్ ప్రతి సినిమాలో ఆలీ నటించేవారు. ఐతే, విభిన్న రాజకీయ అభిరుచుల కారణంగా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, అందుకే పవన్ సినిమాలలో అలీ నటించట్లేదని చాలా మంది అభిప్రాయం.
తాజాగా జరిగిన మీడియా ఇంటిరాక్షన్ లో ఆలీ మాట్లాడుతూ ... సీఎం అనుమతిస్తే, ఆంధ్రప్రదేశ్ లోని ఏప్రాంతం నుండైనా పోటీ చెయ్యడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొనగా, మరి, పవన్ కళ్యాణ్ కు పోటీగా నిలబడతారా ? అనే ప్రశ్నకు మరోసారి వివరణనిస్తూ.. ఆంధ్రాలోని ఏ ప్రాంతం నుండైనా ఎవరిమీదైనా పోటీ చెయ్యడానికి నేను రెడీ.. అంటూ ఆలీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు గరమవుతున్నారు.