పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇవి పూర్తైన వెంటనే సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్' మూవీని స్టార్ట్ చెయ్యనున్నారు. దీని తరవాత కూడా ప్రభాస్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ఎనౌన్స్ చెయ్యనున్నారు.
ఈ నేపథ్యంలో గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి డార్లింగ్ ప్రభాస్ ఒక మల్టీ స్టారర్ మూవీ చెయ్యబోతున్నారన్న వార్త డార్లింగ్ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది. మరి, ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ, డార్లింగ్ అభిమానుల్లో మాత్రం సంతోషకరమైన వాతావరణం నెలకొంది.