కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వినోదయ సిత్తం' అతి త్వరలోనే తెలుగులో రీమేక్ కాబోతుంది. ఈ మేరకు అఫీషియల్ అప్డేట్ ఐతే లేదు కానీ, జోరుగా ప్రచారం మాత్రం జరుగుతుంది. అదీకాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారని తెలియడంతో ఈ ప్రాజెక్ట్ పై మెగా అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, వినోదయ సిత్తం రీమేక్ చేసేందుకు మేనమామ - మేనల్లుడు ఇద్దరూ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 27నుండి వినోదయ సిత్తం తెలుగు రీమేక్ షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే పవన్ పాల్గొనబోతున్నారట కూడా. ఐతే, ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వకుండానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుందట.
![]() |
![]() |