టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ హిట్ సినిమా 'వినోదయ సీతం' రీమేక్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. సముద్రకని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
చాలా నెలలుగా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ప్రారంభానికి ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ నెల 28 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని సమాచారం. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభ తేదీ గురించి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఈ రీమేక్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. పవన్ క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది అని లేటెస్ట్ టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.