పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా "హరిహర వీరమల్లు". క్రిష్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా చాన్నాళ్ల బట్టి విడతలవారీగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుందన్న విషయం తెలిసిందే. గతకొన్ని రోజుల నుండే ఈ మూవీ షూటింగ్ ఎడతెరిపి లేకుండా జరుగుతుంది. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది వేసవికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడబోతుందని టాక్ నడుస్తుంది. అదీకాక ఇదొక పీరియడ్ యాక్షన్ డ్రామా కావడంతో VFX కి చాలా టైం పడుతుంది. ఈ దృష్ట్యా కూడా HHVM మరింత ఆలస్యం కాబోతుందని తెలుస్తుంది. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమా విడుదల ఆలస్యం కాబోతుందని, కానీ, ఈ ఏడాదిలోనే విడుదల ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది.
![]() |
![]() |