తలైవా రజినీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా "జైలర్". నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రమ్యకృష్ణ, యోగిబాబు కీరోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ 'కరునాడ చక్రవర్తి' శివరాజ్ కుమార్ గారు ఒకముఖ్యపాత్రలో నటిస్తుండగా, మరొక ముఖ్యపాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నారు. జైలర్ సెట్స్ నుండి మోహన్ లాల్ మరియు శివరాజ్ కుమార్ లకు సంబంధించిన స్టిల్స్ ను రీసెంట్గానే మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది.
తాజా అఫీషియల్ సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కమెడియన్ సునీల్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు జైలర్ సెట్స్ నుండి సునీల్ స్టిల్ ఒకటి మేకర్స్ తాజాగా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో సునీల్ డిఫరెంట్ ఔట్ ఫిట్ లో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. చూస్తుంటే, ఈ సినిమాలో సునీల్ విలన్గా నటిస్తున్నారనిపిస్తుంది.
ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |