తెలుగుజాతి ఆణిముత్యం, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ. నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అశేష ప్రేక్షకలోకం ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఒక బలమైన పునాదిగా, చరిత్రలో ఒక మరపురాని జ్ఞాపకం గా, తెలుగువాడి సత్తా దశదిశలా వ్యాపింపజేసిన నవరసనటనా సార్వభౌముడిగా ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయంలో ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయే మరణం లేని కారణజన్ముడికి సూర్య సంస్థ నుండి ఘననివాళి అర్పిస్తున్నాం.
![]() |
![]() |