కాసేపటి క్రితమే నాచురల్ స్టార్ నాని గారు యంగ్ హీరోయిన్ రుహాని శర్మ ప్రధానపాత్రలో నటిస్తున్న "హర్" మూవీ టీజర్ ను విడుదల చేసారు. ఈ మేరకు హర్ చిత్రబృందం నాని ని కలిసి, టీజర్ చూపించినట్టు తెలుస్తుంది. టీజర్ ను విడుదల చేసిన నాని చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలియచేసారు.
ఇక, టీజర్ విషయానికొస్తే, ఇంట్రిగ్యుయింగ్ గా సాగింది. టీజర్ లో రుహానికి డైలాగ్స్ కన్నా హావభావాలతోనే నటనను కనబరిచింది. పోతే, హర్ మూవీ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
శ్రీధర్ స్వరాఘవ్ డైరెక్షన్లో పవర్ఫుల్ కాప్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో రుహాని శర్మ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్, రవి వర్మ కీరోల్స్ లో నటించారు. పవన్ సంగీతం అందించారు. డబల్ అప్ మీడియా సమర్పిస్తున్న ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మించారు.