ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శాకుంతలం' నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 11:47 AM

"యశోద" బ్లాక్ బస్టర్ హిట్ తదుపరి క్రేజీ హీరోయిన్ సమంత నుండి రాబోతున్న మరొక పాన్ ఇండియా చిత్రం "శాకుంతలం". గుణశేఖర్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెల 17వ తేదీన 3డి లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.


ఈ నేపథ్యంలో శాకుంతలం మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసి ఫస్ట్ లిరికల్ గా 'మల్లికా మల్లికా' సాంగ్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ముందుగా ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చిన్న టీజర్ ని విడుదల చేసి తెలిపారు. టీజర్ ను బట్టి ఇదొక హీరోయిన్ ఇంట్రో సాంగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. పూర్తి సాంగ్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com