తెలుగు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి లక్ష్మీ నారాయణరావు(90) మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. లక్ష్మీనారాయణరావు అంత్యక్రియలు బుధవారం స్వగ్రామం తూ.గో జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో నిర్వహించనున్నారు.