యంగ్ హీరో నాగచైతన్య, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి కలిసి 'బంగార్రాజు' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.
తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో చిత్రం "కస్టడీ". కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ గ్లిమ్స్ ను విడుదల చేసి హీరో నాగచైతన్యను ప్రేక్షకులకు పరిచయం చేసిన మేకర్స్ తాజాగా హీరోయిన్ కృతిశెట్టి ఇంట్రో పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో కృతిశెట్టి రిజిలియంట్ 'రేవతి' గా సీరియస్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 12న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.