RRR గ్లోబల్ లెవెల్లో సృష్టిస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రీసెంట్గానే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో RRR ఖ్యాతి మరింత పెరిగింది. దీంతో RRR హీరోల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ కారణంగా చరణ్, తారక్ ల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. RRR పూర్తైన వెంటనే RC 15 ను స్టార్ట్ చేసి, షూటింగ్ ను కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు చరణ్. ఎటొచ్చి తారక్ తన నెక్స్ట్ సినిమాను ఆరంభించకుండా అభిమానులను ఉసూరు పెడుతున్నారు.
ఐతే, తాజా సమాచారం ప్రకారం, RRR తదుపరి కొరటాల శివతో తారక్ చెయ్యబోయే మూవీ NTR 30 వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే NTR 30 పూజా కార్యక్రమం కూడా జరగబోతుందని తెలుస్తుంది. ఇకపోతే, ఈ సినిమా హీరోయిన్ పై ప్రేక్షకాభిమానుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. చాలా మంది ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అనుకుంటున్నారు. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.