ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ వచ్చే నెల మూడవ వారంలో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇదొక హారర్ కామెడీ ఎంటర్టైనర్ అని, ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, థమన్ సంగీతం అందిస్తున్నారని ..ఇలా ఈ ప్రాజెక్ట్ పై పలు రకాల రూమర్లు నడుస్తున్నాయి కానీ, దేనిపై కూడా సరైన సమాచారం లేదు. పోతే, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.