సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న మూడవ సినిమా యొక్క న్యూ షెడ్యూల్ ఈరోజే మొదలైంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ల నేతృత్వంలో సూపర్ స్టార్ పలు కీలక యాక్షన్ సీక్వెన్సెస్ లో పాల్గొనబోతున్నారు. ఒక రెండు వారాలపాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందంట.
పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించడం జరిగింది.