పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో "ఆదిపురుష్" అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ టీజర్ రీసెంట్గానే విడుదలై హంగామా చెయ్యగా, టీజర్ కు ఆడియన్స్ నుండి వచ్చిన స్పందనను కన్సిడర్ చేసి, వారికి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు మేకర్స్ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి మరీ, VFX ను పునరిద్ధరిస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ భారీగానే ఖర్చుపెడుతున్నారు కూడాను. ఈ కారణంగానే ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ జూన్ 16కి వాయిదా పడింది. ఈ మేరకు మేకర్స్ గతంలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. కానీ, ఆ తరవాత మళ్లీ ఆదిపురుష్ విడుదల వాయిదా పడబోతుందని ప్రచారం జరగ్గా, తాజాగా మేకర్స్ నుండి ఈ విషయంపై సాలిడ్ క్లారిటీ వచ్చింది.
ఆదిపురుష్ విడుదలకింకా 150 రోజుల వ్యవధి ఉందని, జూన్ 16న ఐమ్యాక్స్, 3డి లో విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి, రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.