మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి మేకర్స్ "గాండీవధారి అర్జున" అనే ఇంటెన్స్ అండ్ యూనిక్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ కాసేపటి క్రితమే టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వరుణ్ కి మేకర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇంతటి పవర్ఫుల్ టైటిల్ కి తగ్గట్టుగానే వరుణ్ నెవర్ సీన్ బిఫోర్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తూ ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేంత కసిగా కనిపిస్తున్నారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం చేస్తున్నారు.
మరి, ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్నది ఎవరు? అన్న విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. పోతే, ప్రస్తుతం ఈ మూవీ లండన్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.