భారీ అంచనాల నడుమ గతేడాది అక్టోబర్ 21న జపాన్లో విడుదలైన RRR సినిమా అక్కడి ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకుంటుంది. ముందుగా బాహుబలి రికార్డును ఆపై జపాన్ ఆల్ టైం హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ రజినీకాంత్ "ముత్తు" లైఫ్ టైం కలెక్షన్లను అధిగమించి, ప్రస్తుతం జపాన్లో హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా RRR కొనసాగుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, జపాన్ బాక్సాఫీస్ పై RRR కలెక్షన్ల పోరు ఇంకా ముగింపు దశకు రాలేదని తెలుస్తుంది. తాజాగా జపాన్ బాక్సాఫీస్ వద్ద RRR 569మిలియన్ యెన్లను అంటే 36.1 కోట్లను కలెక్ట్ చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నెంబర్ ను కేవలం 88 రోజుల్లో RRR అందుకోవడం విశేషం.