ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం "బేబీ". టీజర్ తో ఒక్కసారిగా ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేసిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' విడుదలై, శ్రోతలను విశేషంగా అలరిస్తుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్ వీడియోస్ లో ట్రెండ్ అవుతుంది. విజయ్ బుల్గనిన్ స్వరకల్పనలో సోల్ ఫుల్ మెలోడీగా రూపొందిన ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ను సింగర్ శ్రీరామచంద్ర అండ్ చిల్డ్రన్ కోరస్ పాడారు. అనంత శ్రీరామ్ హృద్యమైన లిరిక్స్ అందించారు. మొత్తానికి ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
తాజాగా ఈ రోజు సింగర్ శ్రీరామచంద్ర పుట్టినరోజు సందర్భంగా బేబీ మేకర్స్ నుండి సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాటకు రిప్రైజింగ్ వెర్షన్ ను విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఈపాటను విపరీతంగా అభిమానిస్తున్న శ్రోతలకు ఇది సంతోషకరమైన వార్త.
సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి లో థియేటర్లలో విడుదల కాబోతుంది.