శ్యామ్ తుమ్మలపల్లి డైరెక్షన్లో శివబాలాజీ, ధర్మ, బ్రిడిగా సాగ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "సింధూరం". శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ శ్రీకృష్ణ కథను అందించారు. గౌర హరి సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఇంటెన్స్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ యొక్క ట్రైలర్ బలమైన కథాకథనాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. మరి, పూర్తి సినిమా వెండితెరపై ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో తెలియాలంటే, జనవరి 26న విడుదల కాబోయే సింధూరం సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.