వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "శబరి". షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి రీసెంట్గా 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరిట ఒక గ్లిమ్స్ వీడియోను విడుదల అయింది. ఈ క్యాప్టివేటింగ్ గ్లిమ్స్ కు ఆడియన్స్ నుండి 1 మిలియన్ వ్యూస్ తో టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాని కొత్త దర్శకుడు అనిల్కట్జ్ అకా అనిల్ కుమార్ రూపొందిస్తున్నారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాధ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి కొండ్ల సమర్పిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.