మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘VT12’ నుంచి అప్ డేట్ వచ్చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ హీరోగా ‘గాండివధారి అర్జున’ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పోస్టర్ సహా మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను ఎస్ వీఎస్ఎస్ బ్యానర్ పై ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఎఫ్3 సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ సినిమాతో కొత్త రోల్ ని ఎంచుకునే వరుణ్ తేజ్ ఈసారి యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఆ స్థాయి రోల్ తో తీస్తున్న సినిమా ఇది.