కోలీవుడ్ సీనియర్ హాస్యనటుడు వడివేలు గారికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి శ్రీ. సరోజినమ్మ గారు 87ఏళ్ళ వృద్ధాప్యంలో వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదపు ఛాయలు నెలకొన్నాయి. సినీప్రముఖులు, రాజకీయనాయకులు, ప్రేక్షకాభిమానులు వడివేలు, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియచేస్తున్నారు. సరోజినమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.