ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీసావంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అనుచితమైన వీడియోలు, ఫోటోలను వైరల్ చేసిందంటూ ఓ మహిళా మోడల్ ఫిర్యాదు చేయడంతో ముంబైలోని అంబోలీ పోలీసులు రాఖీసావంత్ ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం రాఖీసావంత్ ను అంబోలి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, రాఖీ సావంత్ గతేడాది ఆదిల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.