తొలిచిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. నెమ్మదిగా గ్లామర్ మెరుపులతో అభిమానులతో పాటు నెటిజన్లను మైమరిపిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన తొలిచిత్రం ‘కేజీఎఫ్’. కన్నడ పరిశ్రమ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సినిమా. యష్ ప్రధాన పాత్రలో నటించగా.. కథానాయికగా శ్రీనిధి అలరించింది. ‘కేజీఎఫ్’,‘కేజీఎఫ్2’లో శ్రీనిధి తన అగ్రెసివ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ చిత్రం పాన్ ఇండియన్ ఫిల్మ్ గా విడుదలవడంతో శ్రీనిధికి దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కింది. అదే ఊపులో ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లు అందాయి. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. రెడ్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. హాఫ్ షోల్డర్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. యంగ్ బ్యూటీ పరువాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు
All hearts pic.twitter.com/OfiJlHq9h1
— Srinidhi Shetty (@SrinidhiShetty7) January 18, 2023