ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాకుంతలం చిత్రం నుంచి సమంత స్టిల్స్ !

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 19, 2023, 02:40 PM

 ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శాకుంతలం'. ఈ చిత్రంలో శకుంతల పాత్రను ప్రముఖ నటి సమంత పోషించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సమంత మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ఈ ఫొటోలు శాకుంతలం మూవీలోని 'మల్లికా' పాటలోని స్టిల్స్‌ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిరత్నం సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసి ప్రముఖ హీరో వెంకటేష్‌ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి హార్ట్‌ ఎమోజీని పోస్ట్‌ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ లుక్‌ అందరి హృదయాలను దోచుకుంటుంది అని మరో అభిమాని అన్నారు.


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com