నటుడు మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పేశారు. అయితే, అందరూ అనుకున్నట్లు తన పెళ్లి గురించి కాకుండా తాను మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తన కొత్త సినిమా ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘నేను సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. వాట్ ద ఫిష్ అనే కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. ఈ సినిమా కచ్చితంగా క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని ఆశిస్తున్నాఅంటూ ట్వీట్ చేశారు.
మంచు మనోజ్ 2004లో ‘దొంగ దొంగది’ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘శ్రీ’, ‘రాజుభాయ్’, ‘నేను మీకు తెలుసా’ వంటి భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. చివరికి 2010లో విడుదలైన ‘బిందాస్’, ‘వేదం’ సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ‘బిందాస్’ సినిమాకు నందీ అవార్డును సైతం అందుకున్నాడు. 2018లో ‘అపరేషన్ 2019’ మూవీ తర్వాత మళ్లీ మనోజ్ సినిమాలకు సైన్ చేయలేదు. 2015లో తన గర్ల్‌ఫ్రెండ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్.. 2019లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నారు. సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు.