టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ "మైఖేల్" చిత్రంతో పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు.
వచ్చే నెల మూడవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న మైఖేల్ మూవీకి సంబంధించి ప్రస్తుతం మేకర్స్ ముమ్మర ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైఖేల్ వరల్డ్ నుండి కీరోల్స్ ను పరిచయం చేస్తూ వచ్చిన మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు మైఖేల్ ట్రైలర్ ను జనవరి 23న అంటే ఎల్లుండి విడుదల చెయ్యబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు