నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న కొత్తచిత్రం "హంట్". కొత్తదర్శకుడు మహేష్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల విడుదలైన హంట్ టీజర్, ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, హంట్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, సెన్సార్ బృందం నుండి యూ/ ఏ సర్టిఫికెట్ తెచ్చుకుందని తెలుస్తుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి, మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
పోతే, ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల26న విడుదల కాబోతుంది.
![]() |
![]() |