విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ "గుర్తుందా శీతాకాలం". ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్‌టైల్' ఆధారంగా గుర్తుందా శీతాకాలం తెరకెక్కింది. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నిర్మింపబడిన ఈ సినిమాను నాగశేఖర్ డైరెక్ట్ చేసారు. కాలభైరవ సంగీతం అందించారు. మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం కీలకపాత్రలు పోషించారు.
పలు వాయిదాల తదుపరి డిసెంబర్ 9న ధియేటర్లకొచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పూర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతో కాలం నిలవలేక వెనుదిరిగింది. తాజా అధికారిక సమాచారం మేరకు, ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. సో, ఎవరైతే, ఈ సినిమాను థియేటర్లలో మిస్సయ్యారో .. వారికి నెట్ ఫ్లిక్స్ అందించిన మంచి అవకాశం. డోంట్ మిస్ ఇట్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa