విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న "ధమ్కీ" సినిమా నుండి సెకండ్ సింగిల్ 'మావా బ్రో' లిరికల్ వీడియో నిన్న సాయంత్రమే విడుదల కాగా, ఫుట్ టాప్పింగ్ మ్యూజిక్ తో ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇంకా 24 గంటలకు కూడా గడవక ముందే ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. రామ్ మిర్యాల స్పెషల్ గా కంపోజ్ చేసి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించారు.
నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వణ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa