డైరెక్టర్ కం కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "చంద్రముఖి 2". బ్లాక్ బస్టర్ "చంద్రముఖి" కి దాదాపు పదిహేడేళ్ల తదుపరి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేస్తున్నారు. హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ సినిమా గత కొన్నాళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటుంది.
తాజా అఫీషియల్ సమాచారం మేరకు, చంద్రముఖి 2 పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. చంద్రముఖి 2 తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో ఫ్యూచర్ లో డిజిటల్ ఎంట్రీ ఉంటుందని సదరు సంస్థ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసింది.
పోతే, ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa