ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ పుట్టినరోజున 'RC15' ఫస్ట్ లుక్ విడుదల కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 06:51 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో ఐఏఎస్ అధికారిగా, మరో పాత్రలో పల్లెటూరి వ్యక్తిగా కనిపించనున్నాడు. అయితే ఈ మార్చిలో 'RC15' నిర్మాతలు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa