ధమాకా :
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ రన్ సాధించిన ఈ చిత్రం ఇప్పుడు జనవరి 23న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.
ఈ సినిమాలో తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
గుర్తుందా సీతకాలం :
నాగశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన 'గుర్తుందా సీతకాలం' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 20న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రం కన్నడ హిట్ చిత్రం లవ్ మోక్‌టెయిల్‌కి అధికారిక రీమేక్. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడిగా నటిస్తుంది.
ఈ సినిమాలో ప్రియదర్శి, సుహాసిని, మేఘా ఆకాష్ మరియు కావ్య శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి MM కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్ సంయుక్తంగా నిర్మించారు.
18 పేజెస్ :
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన రొమాంటిక్ డ్రామా "18 పేజెస్" సినిమా జనవరి 27, 2023న ఆహా మరియు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa