సంక్రాంతి కానుకగా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నుండి 'వారిసు / వారసుడు' విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, దిల్ రాజు నిర్మాణసారథ్యంలో ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా తదుపరి విజయ్ కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు సైన్ చేసిన విషయం తెలిసిందే. చడీచప్పుడు లేకుండా రీసెంట్గానే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమై, రెగ్యులర్ షూటింగ్ షురూ చేసిన ఈ సినిమా యొక్క అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రిపబ్లిక్ డే రోజున ఉండబోతుందని తాజా సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa