'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో గతేడాది ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు ఈ ఏడాది యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ 'హంట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 26న అంటే వచ్చే గురువారమే హంట్ థియేటర్లకు రాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ హంట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసారు. ఐతే, ఈ రోజు ఉదయమే జరగాల్సిన ఈ ప్రెస్ మీట్ ను ఒక రోజు వాయిదా వేసి రేపు ఉదయం పదిన్నరకు నిర్వహించబోతున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లోని AMB సినిమాస్ స్క్రీన్ 6 లో రేపు ఉదయం పదిన్నరకు హంట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరగనుంది.
చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. కొత్తదర్శకుడు మహేష్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa