లీడ్ హీరో, సపోర్టింగ్, విలన్.. ఏ రోల్ లో నైనా తనదైన నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు నవీన్ చంద్ర. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "మాయగాడు". ఇందులో గాయత్రి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. స్వాతి పిక్చర్స్ బ్యానర్ పై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దయానంద సరస్వతి సమర్పిస్తున్నారు. అడ్డా ఫేమ్ జి కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా మాయగాడు ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. పైరసీలు చేసే ఒక యువకుడు ప్రొడ్యూసర్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన వృత్తిని వదులుకున్నాడా ? ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఎదురుకొన్న సంఘటనలేంటి? అనే ఆసక్తికరమైన కథాకథనాలతో ట్రైలర్ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
పోతే, ఈ మూవీ వచ్చే నెల 3వ తేదీన థియేటర్లకు రాబోతుంది.